నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన తెలంగాణ అమ రవీరుల స్థూపం నేడు సోమవారం ఉదయం 10 గంటలకు ఆవిష్కరిం చనున్నట్లు పూర్వపు జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ ఒక ప్రకటన తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమం ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా జరగనుంది. ముఖ్య గౌరవ అతిథులుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌చ ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య, విద్యావంతుల వేదిక నాయ కులు గురజాల రవీందర్, విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ తుమ్మ పాప ిరెడ్డి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనా రాయణచ న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ సూర్యం చంద్రన్న,అడ్వకేట్ అంబర్ శ్రీనివాస్, టీజేఎస్ నాయ కులు ధర్మార్జును, బైరి రమేష్ హాజరుకానున్నట్లు సత్యనారాయణ తెలిపారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థి రైతు ఉద్యమం ఉద్యోగ ఉపాధ్యాయ న్యాయ వాద, వైద్య, జర్నలిస్ట్ సంఘాల నా యకులు హాజరుకావాలని కోరారు.