
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో పదవ శాఖా మహాసభ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొత్త నరసింహులు మాట్లాడుతూ మహాసభ ప్రారంభానికి ముందు పార్టీ కార్యదర్శులు అయినటువంటి పేరు నరసింహ సీపీఐ(ఎం) పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. గ్రామంలో గతంలో మా సభ నుండి ఇప్పటివరకు జరిగిన పార్టీ కార్యక్రమాలు విజయాల పై చర్చించినట్లు తెలిపారు. జంగంపల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అనేక విజయాలను సాధించిందని ప్రధానంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడి పట్టాలు సాధించిన ఘనత సిపిఎం పార్టీ దేనని తెలిపారు. ప్రజలతో మమేకమై విజయాలు సాధిస్తున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామంలో ఉన్న సమస్యలపై రాజిలేని పోరాటాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పేరు నర్సవ్వ, నర్సింలు, కొండం పద్మ, కర్రేళ్ల మల్లయ్య, కొంగ సత్యనారాయణ, భక్తి సత్యవ్వ, మాడుగుల శ్యామల, పేరం రమణ, దేవరాజ్, సావిత్రి, బాలరాజ్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.