సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ..

Wall magazine of CPI(M) State Congress inaugurated..నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి లో నిర్వహించనున్నారు. ఈ మహాసభలు విజయవంతానికి చేపట్టే ప్రచార సామాగ్రి గోడ పత్రికలను ఆదివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు అర్జున్,చిరంజీవి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఈ మహాసభలు సందర్భంగా 25 నిర్వహించే ప్రజా ప్రదర్శనకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ రావు,మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.