తాజ్పూర్ గ్రామంలో వైర్ లెస్ సీసీ టీవీ కెమెరాల ప్రారంభోత్సవం

– సీసీటీవీ కెమెరా ఆది శివుని త్రినేత్రంతో సమానం….
– హాజరైన రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ సభ్యులు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో బుధవారం రోజు ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేజ్ కమ్యూనిటీ 16  వైర్ లెస్ సీసీ టీవీ కెమెరాల ప్రారంభోత్సవానికి దాతగా ముందుకు వచ్చిన డాక్టరేట్ అవార్డు గ్రహీత ,  క్లబ్ డైరెక్టర్ ర్యాకల శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. పంచాయితీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి సభ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ వారు మాట్లాడుతూ వైర్ లెస్ సీసీ టీవీ కెమెరాలు గ్రామ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒకే సీసీ టీవీ కెమెర   10 మంది పోలీసులతో సమానం అన్నారు. కాకపోతే ఈ నూతన వైర్ లెస్ సీసీ టీవీ కెమెరాల ద్వారా గ్రామంలో కోతుల ద్వారా కానీ , భారీ వాహనాల ద్వారా ఎలాంటి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉంటుందని తెలిపారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా గ్రామంలో జరుగుతున్న దోంగ తనాలను అరికట్టవచ్చు అన్నారు. మామూలు కెమరాల పనితీరు కంటే 100 శాతం ఎక్కువ పని చేస్తాయని రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ గవర్నర్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టరేట్ అవార్డు గ్రహీత ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ నేను రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ సంస్థలో గత 10 సంవత్సరాలుగా పని చేయడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ ద్వారా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా తాజ్పూర్ గ్రామంలో వైర్ లెస్ సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీసీ టీవీ కెమెరా అంటే భగవంతుని త్రినేత్రం అన్నారు. గ్రామ ప్రజలు సహకరిస్తే మరిన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. ముఖ్యఅతిథి రాంప్రసాద్ మాట్లాడుతూ ర్యొకల శ్రీనివాస్ క్లబ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అలుపెరుగని సైనికుడిలా పనిచేస్తున్నాడన్నారు. ఒక్క శ్రీనివాస్ గ్రామంలో వెయ్యి ముక్కలు నాటితే గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఎన్ని వేల మొక్కలు నాటగలరని ప్రశ్నించారు. రోటరీ క్లబ్ సుమారు 170 సంవత్సరాల క్రితమే స్థాపించడం జరిగిందని, ఈ క్లబ్లో ప్రతి ఒక్కరూ బాగా సామీలు కావాలని కోరారు. ఈ క్లబ్ ద్వారా సికింద్రాబాద్ దగ్గరలో ఒక డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక యూనిట్ ద్వారా ఒక పేషెంట్ కు పది నుండి 20 సార్లు డయాలసిస్ చేయడం జరుగుతుందన్నారు.  జూబ్లీహిల్స్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని, మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో కన్నతల్లి కడుపులో ఉన్న పిండం ఎదుగుదల ఎలా ఉంటుందో తెలిపే అధునాతన పరికరాలతో టెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి, క్లబ్  జిల్లా అధ్యక్షులు రాంప్రసాద్, ఎండి అనిఫ్ మెహమన్ క్లబ్ భువనగిరి అధ్యక్షులు, గవర్నర్ సింగమైన నర్సింగ్ యాదవ్, న్యూ క్లబ్ చైర్మన్ యెంపల్ల బుచ్చిరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ యెంపల్ల వెంకట్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి, కార్యదర్శి పిన్నపురెడ్డి సుమంత్ రెడ్డి, సెంట్రల్ క్లబ్ చైర్మన్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, చైర్మన్ పార్ట్నర్షిప్ గవర్నర్ పక్కీరు కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొమ్మరపు సురేష్, మాజీ ఉప సర్పంచ్ ర్యాకల సంతోష మాజీ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలను ప్రారంభించిన అనంతరం ముఖ్య అతిథులకు క్లబ్ డైరెక్టర్, డాక్టరేట్ అవార్డు గ్రహీత ర్యాకల శ్రీనివాస్ శాలువాలతో సత్కరించి మెమొంటో లను అందజేశారు.