ఎడతెరిపి లేని వాన 

– నల్లగొండ జిల్లావ్యాప్తంగా 14.8 సగటు వర్షపాతం నమో 
– అత్యధికంగా వేములపల్లి లో.. అత్యల్పంగా నేరడుకొమ్ము లో   నమోదు 
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : అల్పపీడన ద్రోని ప్రభావంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం వరకు 14.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయింది. జిల్లాలోని వేములపల్లి మండలంలో అత్యధికంగా 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా నేరేడు కొమ్ములో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వేములపల్లి, దామరచర్ల, అనంతరం వర్షపాతం ఎక్కువగా నల్లగొండ మండలంలోని 29.9 మిల్లీమీటర్లు వర్షం నమోదయింది. జిల్లా వ్యప్తంగా నేటికీ163.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 225.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. 38 శాతం వర్షపాతం అధికంగా నల్లగొండ జిల్లాలో నమోదయింది. అల్పపీడన ధోని ప్రభావంతో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
మండలాల వారిగా వర్షపాతం..
వేములపల్లి 31.5 మి.మీ,దామెరచెర్ల 30.2,నల్గొండ 29.9, కేతేపల్లి 27.8,మాడుగులపల్లి 27.8, తిప్పర్తి 26.5, కనగల్ 23.4, మునుగోడు 23.3, మిర్యాలగూడ 21.8, నక్రేకల్ 20.5, త్రిపురారం 20.2, నిడ్మనూరు 19.6, చందూర్ 18.1,నార్కెట్‌పల్లి 16.7, కట్టంగూర్ 16.5,అనుముల 15.4, అడవిదేవులపల్లి 12.6,శాలిగౌరారం 11.5, చిట్యాల్ 10.4,గుండ్లపల్లి 8.8, మర్రిగూడ 7.6,గుర్రంపోడ్ 7.3,నాంపల్లి 7.0, తిరుమలగిరి సాగర్ 6.6, గట్టుపల్ 6.3, పి ఎ పల్లి 5.2,పెద్దవూర 4.9, చింతపల్లి 4.9,చందంపేట 3.5,దేవరకొండ 2.8,కొండ మల్లేపల్లి 2.5, నేరేడుగొమ్ము 1.3. మిల్లీమీటర్లు.