గత రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మండల కేంద్రమైన తాడిచర్ల లోని ఓసిపి బ్లాక్-1లో బొగ్గు ఉత్పత్తికి, మట్టి తవ్వకాలకు అంతరాయం ఏర్పడిందని ఏఎమ్మార్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ పిఆర్ఓ మల్లేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ఓసిపి పనులకు ఆటంకం కలగడంతో 7000 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడినట్లుగా,లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాల వెలికితీతకు ఆటంకం ఏర్పడిందన్నారు.ఓసిపిలో రోడ్లు బురదమయం కావడంతో బొగ్గు, మట్టి వెలికి తీసే, యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.