సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్..

Incharge Police Commissioner who conducted the review meeting..నవతెలంగాణ – కంఠేశ్వర్ 
 పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు ఎస్.ఐలతో సమీక్ష సమావేశం నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి. హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్ ఆద్వర్యంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. నూతన సంవత్సరం సందర్బంగా సిబ్బంది అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరంలో సిబ్బంది అందరూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని అందుకోసం ఒక ప్రణాళికను రూపొందిచుకొని నేరాల నియంత్రణ కోసం ప్రతీ సిబ్బంది తమ పై అధికారుల సూచనలను తూ.చ తప్ప కుండా పాటించాలని తెలియజేశారు. ప్రధానంగా చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రధానదృష్టి సారించాలని, కోర్టు కేసుల విషయంలో త్వరితగతిన స్పందించాలని, పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పర్చాలని, నిఘా వ్యవస్థను ముమ్మరం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్)  జి. బస్వారెడ్డి, ప్రొబేషనరి ఐ.పి.యస్., సాయికిరణ్ పత్తిపాక., నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సి.యస్.బి, సి.సి.ఆర్.బి, సి.సి.ఎస్, సైబర్ క్రైమ్, సి. టి. సి ఎ.సి.పిలు మరియు సి.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.