
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండా, పినవూర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. శనివారం పినవూర బీగ్రామం లో 50 కుటుంబాలు,కుంకుడు చెట్టు తండాలో 20 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కర్నాటి లింగారెడ్డి, మాజీ ఎంపీటిసి శంకర్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జయవిర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.