ఎమ్మెల్యే సమక్షంలో కూనేపల్లి గ్రామస్తుల చేరిక

నవతెలంగా- రెంజల్:
రెంజల్ మండలం కూనేపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి 20 మంది కార్యకర్తలు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డలింగం, నరసింహారెడ్డి, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.