చేరిక…నియామకం

చేరిక...నియామకం–  మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి జాక్‌పాట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి జాక్‌పాట్‌ వరించింది. శుక్రవారంనాడాయన బీజేపీని వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కుమారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పార్టీలో చేరగానే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీపాదాస్‌ మున్షీ ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య క్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.