
నాగార్జున సాగర్ నియోజకవర్గం మాడుగుల పల్లి మండలం, అభంగాపురం గ్రామానికి చెందిన బిఎస్పి మండల పార్టీ అధ్యక్షుడు జిల్లా రామకృష్ణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయించు రాములు, రాయించు అచ్చయ్య, రాయించు పాండు, రాయించు నగేష్, రాయించు రాములు వీరు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై శనివారం వివిధ పార్టీలను వీడి నాగార్జునసాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోరే వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బూర జనార్ధన్, నాయకులు పసిడిపల్లి గంగాధర్, జిల్లా మట్టయ్య, జిల్లా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.