ఆర్టీసీకి ఆదాయం రాఖీ పండుగ

Income for RTC is Rakhi festival– నాలుగు రోజుల్లో రూ. 94 లక్షలు
– అదనపు బస్సులున్న సరిపోని వైనం
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
రాఖీ పౌర్ణమితో పాటు వరుస సెలవులు రావడంతో సాధారణ ప్రజలతో పాటు ఆర్టీసీకి కూడా వరంగా మారింది. ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపోకు నాలుగు రోజుల్లో రూ.93 లక్షల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది.
ఆర్టీసీకి ఆదాయం రాఖీ పండుగ
రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపో ఆదాయం పెరిగింది. రోజువారీగా రూ.16 నుండి 18 లక్షలు ఆదాయం రాగ అదనంగా ప్రతిరోజు రూ.నాలుగు నుండి రూ.పది లక్షలు ఆదాయం వచ్చింది. ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపోకు రాఖీ పౌర్ణమి ఆదాయం పండుగను తెచ్చింది.
నాలుగు రోజుల్లో రూ.94 లక్షలు
గడిచిన నాలుగు రోజుల్లో ఆసిఫాబాద్‌ డిపోకు రూ.94 లక్షలపై చిలుకు ఆదాయం వచ్చింది. 16వ తేదీన రూ.19,40,380, 17న రూ. 22,09,764, 18న రూ.24,41,025, 19న రూ.28,27,050 ఆదాయం వచ్చింది. ప్రతిరోజు 33వేల ిలోమీటర్లు తిరుగుతుండగా నాలుగు రోజుల్లో గరిష్టంగా 38వేల కిలోమీటర్లు తిరిగాయి.
అదనపు బస్సులు ఉన్న తప్పని తిప్పలు
వరుస సెలవులు రాఖీ పౌర్ణమి నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు గతంతో పోలిస్తే అదనపు బస్సులు, ట్రిప్పులు నడిపించారు. అయినప్పటికీ మహాలక్ష్మి పథకంలో భాగంగా జీరో టికెట్‌తో నడుస్తున్న నేపథ్యంలో బస్సులు కిక్కిరిసిపోయాయి. మహాలక్ష్మిలో భాగంగా ఆసిఫాబాద్‌ డిపో పరిధిలో ఈనెల 16న 29,507 మంది మహిళలు ప్రయాణించగా 17న 33,300 మంది, 18న 35,615 మంది, 19 రాఖీ పౌర్ణమి రోజు 40,430 మంది మహిళలు ప్రయాణించారు.