నాలుగేండ్ల కనిష్టానికి భారత కంపెనీల ఆదాయం

For a minimum of four years Income of Indian companies– క్రిసిల్‌ అంచనా
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత కంపెనీల రెవెన్యూ వృద్థి 5-7 శాతానికి పరిమితం కావొచ్చని ప్రముఖ రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. ఇది నాలుగేండ్ల కనిష్టమని పేర్కొంది. నిర్మాణ రంగంలో నెలకొన్న స్తబ్దతనే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. మొత్తం భారత కంపెనీల రెవెన్యూలో నిర్మాణ రంగం 20 శాతం వాటా కలిగి ఉంటుందని తెలిపింది. ఈ రంగానికి సంబంధించిన అనుబంధ పెట్టుబడుల్లోనూ ఒత్తిడి నెలకొందని క్రిసిల్‌ పేర్కొంది. 435 కంపెనీలను ఖాతాలను విశ్లేషించి ఈ రిపోర్ట్‌ను రూపొందించినట్టు పేర్కొంది. విద్యుత్‌, స్టీల్‌, సిమెంట్‌, ముడి సరుకుల డిమాండ్‌లో స్తబ్దత చోటు చేసుకుందని విశ్లేషించింది. ఇంతక్రితం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 8.3 శాతం వృద్థి చోటు చేసుకుందని వెల్లడించింది.