న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో సాధారణ బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 12.8 శాతం పెరిగి రూ.19,290.70 కోట్లకు చేరాయి. 2022 ఆగస్ట్‌లో రూ.17,101.72 కోట్ల ప్రీమియం వసూళ్లయ్యింది. గడి చిన నెలలో బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ రికార్డ్ స్థాయిలో 64.27 శాతం వృద్థితో రూ.1677.87 కోట్ల ప్రీమియంను నమోదు చేసింది. ఈ రంగంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 2.63 శాతం పెరుగుదలతో రూ.2,310.59 కోట్ల ప్రీమియం వసూలు చేసింది. ఎస్‌బిఐ జనరల్ ఇన్స్యూరెన్‌్‌స కంపెనీ 17 శాతం పతనంతో రూ.1,246.48 కోట్ల వసూళ్లు చేసింది. 2023 ఆగస్ట్‌లో జీవిత బీమా కంపెనీలు నూతన ప్రీమియం వసూళ్లలో 18.47 శాతం తగ్గుదలతో రూ.26,788 కోట్లకు పరిమితమయ్యాయి. 2022 ఆగస్ట్‌లో ఈ సంస్థలు రూ.32,856.38 కోట్ల నూతన ప్రీమియంను వసూలు చేశాయి.