
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లాఅడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ సూచించారు. మహాముత్తారం మండలంలోని కోనంపేట, మీనాజీపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిష నల్ కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం, రవాణా వివరాలు, నిల్వ ఉన్న ధాన్యం, తూకం ప్రక్రియ తదితర అంశాలపై ఆరా తీశారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సమ యానికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదే శించారు. కొనుగోలు చేసిన ధాన్యం ట్యాగ్ చేసిన మిల్లుకు వెనువెంటనే పంపించాలని, రవాణాలో ఆలస్యం జరగకుండా చూసుకోవాలన్నారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు ట్యాబ్ ఎంట్రీలు వేగవంతంగా చేయాలని నిర్వాహకులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట జిల్లా పౌరస రఫరాల అధికారి శ్రీనాథ్, పీఏసీఎస్ సీఈఓ, సెంటర్ ఇన్చార్జ్లు ఉన్నారు.