– కోదండరామ్‌కు అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టీఎస్‌కేసీ) ఫుల్‌టైం మెంటార్స్ జీతాలను పెంచాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు టీజేఎస్ అధినేత కోదండరామ్‌ను శనివారం హైదరాబాద్‌లో ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కరుణాకర్, సంయుక్త కార్యదర్శి సిహెచ్ కిశోర్‌కుమార్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకులకు అప్పుడు రూ.8,500 చెల్లించారనీ, ప్రస్తుతం రూ.58,850 ఇస్తున్నారని గుర్తు చేశారు. తమకు రూ.ఎనిమిది వేలు ఇచ్చే వారని తెలిపారు. ప్రస్తుతం రూ.17,500 ఇస్తున్నారని పేర్కొన్నారు. తమకు రూ.22,750 జీతం చెల్లించాలని కోరారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కోదండరామ్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌కేసీ మెంటార్స్ అసోసియేషన్ నాయకులు రాజశేఖర్, సంతోష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.