బీజింగ్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఒత్తిడికి గురైతుంటే మరోవైపు చైనా మాత్రం వృద్థిని నమోదు చేస్తోంది. ఏడాదికేడాదితో పోల్చితే ప్రస్తుత ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం పెరిగింది. ఇంతక్రితం త్రైమాసికంలో 4.5 శాతం రాణించింది. కరోనా అనిశ్చిత్తి వల్ల గతేడాది ఇదే జూన్ త్రైమాసికంలో జిడిపి 0.4 శాతం పెరిగింది. గడిచిన త్రైమాసికంలో ఆ దేశ ఎగుమతుల్లో తగ్గుదల చోటు చేసుకున్నప్పటికీ.. దేశీయంగా వినిమయం పెరగడంతో జిడిపి పెరిగింది.