పెరిగిన నేరాలు

– ఇండ్లలో చోరీ మహిళలపై దాడులు అదే పరిస్థితి
– పెరిగిన సైబర్,వైట్ కాలర్ నేరాలు
– పెరిగిన రోడ్డు ప్రమాదాలు
– వార్షిక నివేదిక సమావేశంలో డిసిపి లా అండ్ ఆర్డర్ జయరాం వెల్లడి
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సర కాలం పాటు నేరాల సంఖ్య బాగానే పెరిగింది. పచ్చలు అత్యాచారాలు వేధింపులు అమ్మాయిల ఇంట్లో చొరబడి దొంగతనాలు ఇలా అన్ని కేసులలో నేరాల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగింది. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యల కాలం పాటు జరిగిన నేరాల వివరాలను నిజామాబాద్ డిసిపి లా అండ్ ఆర్డర్ జయరాం వెల్లడించారు. ఇందులో హెచ్ బి బై డే దొంగతనాలు 45 జరగదు రాత్రి దొంగతనాలు 289 జరిగాయి. ఫోక్సో యాక్ట్ కింద గత సంవత్సరం 80 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 77 కేసులు నమోదయ్యాయి. వైట్ కాలర్ నేరాలు గత సంవత్సరం మొత్తంగా 626 జరుగును ఈ సంవత్సరం 708 కేసులు నమోదయ్యాయి. గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ కొన్నానుగా చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించినంత ఫలితాలు ఏమి కనిపించడం లేదు. ప్రస్తుతం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నట్లు అందుకని టీమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా పోలీసుల అదుపులోనే ఉన్నాయని శాంతిభద్రతలకు ఎలాంటి వివాదం కలవకుండా గతంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తో పాటు కమిషనర్ కల్మేశ్వర్ సైతం జిల్లాలో మంచి బందోబస్తును పటిష్టం చేశారన్నారు. సంచలనం సృష్టించిన పలుకేసుల్లో సైతం ముందున్నామన్నారు. వాటిని పట్టుకోవడంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉందన్నారు. జీవిత ఖైదీ శిక్షలు కూడా ఈ సంవత్సరం 14 మందికి విధించారని అలాగే 10 సంవత్సరాలు,8,  నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం ఇలా సుమారు 100 వరకు శిక్షలు విధించారన్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం సూసైడ్ కేసులు కూడా ఒక పర్సెంట్ మాత్రమే పెరిగాయి అన్నారు. మోడల్ ఎలక్షన్ కోడ్లో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించడం జరిగింది గత 2018 ఎన్నికలలో 50 కేసులు నమోదు చేయగా ఈ సంవత్సరం 2023 ఎన్నికలలో భాగంగా ఒక 117 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా మద్యం లిక్కర్ డబ్బులను సిస్టం జరిగిందని వెల్లడించారు ఎన్నికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసామన్నారు ఎక్కడైతే ఇబ్బంది కలిగిన చోట అక్కడ కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ సంవత్సరం కొన్ని కేసులలో చేదించగా మరికొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా రెండు మూడు నెలల్లో కేసులను చేదిస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన ఆంక్షలు విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ( L & O )  ఎస్. జయ్ రామ్, నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్, సిసిఆర్బి ఏసిపి రవీందర్ రెడ్డి,సి టి సి ఎ సి పి శ్రావణ్ కుమార్,ట్రాఫిక్ ఏసిపి నారాయణ,టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజు,సిసిఎస్ ఏసిపి విజయ సారధి,సి సి ఆర్ బి సి ఐ సురేందర్ రెడ్డి మరియు ఐటి కోర్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.