ముంబయి : వరుసగా ఐదో వారం భారత విదేశీ మారకం నిల్వలు పెరిగాయి. మార్చి 22తేదితో ముగిసిన వారంలో 140 మిలియన్ డాలర్లు పెరిగి 642.63 బిలియన్ డాలర్లకు చేరయని ఆర్‌బిఐ శుక్రవారం వెల్లడించింది. బంగారం రిజర్వ్ నిల్వలు 347 మిలియన్ డాలర్లు పెరిగి 51.49 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 27 మిలియన్ డాలర్లు తగ్గి 4.66 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 645 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకాయి. ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి.