
నవతెలంగాణ – ధర్మసాగర్
యేసుక్రీస్తును మాదిరికరంగా తీసుకొని ప్రతి ఒక్కరు తనని తాను తగ్గించుకున్నట్లయితే జీవితంలో హెచ్చించబడతారని కరుణాపురంక్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ ఫౌండర్, అంతర్జాతీయ ప్రసంగీకులు, ప్రవక్త రెవ. డాక్టర్ సంగాల పాల్సన్ రాజు అన్నారు. మండలంలోని కరుణాపురంలో సొసైటీ ఆఫ్ క్రైస్ట్ జనరల్ సెక్రటరీ రెవ.డాక్టర్ జయప్రకాశ్ గోపు అధ్యక్షతన జరిగిన శిష్యులు పాదాలు కడిగే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో సమాజంలో హెచ్చింపు గుణం గర్వంగా ఉండే స్వభావంతో, సమాదానం కోల్పోవడం జరుగుతుందన్నారు. శాంతి స్దాపన కోసం యేసుక్రీస్తు చూపిన తగ్గింపు స్వభావం చాలా గొప్పదని వివరించారు. దైవకుమారుడైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడునున్న రాత్రి ప్రభువు దైవ కుమారుడిగా తనను తాను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగి మానవాళి మాదిరి గా నిలిచారని అన్నారు. ఈ లోకంలోని ప్రజలు క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తే శాంతి, సమాదానము, నెమ్మది చేకూరుందన్నారు. ఈ సందర్భంగా మే 3,4,5,6,7 తేదీల్లో జరిగే ప్రార్దన పండుగల పోస్టర్ ను పాల్సన్ రాజు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మత్యాస్ రెడ్డి, జయపాల్ రెడ్డి, సంగాల యీర్మియా,డాక్టర్ ప్రదీప్, జయాకర్,రవి పాల్ బ్రదర్స్, సిస్టర్స్, వాలంటీర్ భారీ సంఖ్యలో విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.