హైదరాబాద్‌లో పెరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు

– మేలో 31 శాతం వృద్థి
హైదరాబాద్‌ : ప్రస్తుత ఏడాది మేలో హైదరాబాద్‌లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో 31 శాతం వృద్థి చోటు చేసుకుందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది. గడిచిన నెలలో మొత్తంగా 5877 నివాసాలు రిజిస్ట్రేషన్‌ కాగా.. ఇంతక్రితం ఏప్రిల్‌లో ఇది 4494 యూనిట్లుగా ఉందని వెల్లడించింది. విలువ పరంగా 2023 మేలో 31 శాతం వృద్థితో రూ.2,994 కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ నమోదయ్యింది. రూ.25-50 లక్షల మధ్య విలువ చేసే నివాసాలు 55 శాతం వాటా కలిగి ఉన్నాయి. 1,000 – 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల యూనిట్ల వాటా 70 శాతంగా ఉంది.