వెల్లివిరిసిన ఓటరు చైతన్యం..

– ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా యస్.పి. రాహుల్ హెగ్డే తో కలసి 13- నల్గొండ, 14 -భువనగిరి పార్లమెంట్ పరిధిలో గల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిదీలలో గల  పోలింగ్ కేంద్రాల్లో జరుగుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయంలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి  సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. ఉదయం నుంచే ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందని అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు హక్కు వేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. తదుపరి స్థానిక పిడబ్ల్యుడి ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళి, ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు.అనంతరం  అన్ని కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు  ఓటింగ్ జరుగుతున్నందున  ఓటర్లు సమయం మించిపోయే వరకు వేచి ఉండకుండా ముందస్తుగానే పోలింగ్ కేంద్రాలకు విచ్చేసి అమూల్య మైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
     అంతకుముందు సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మణిక్యరావు సూర్యవంశీ అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తో కలసి 13 నల్గొండ పార్లమెంట్ పరిధిలో గల అసెంబ్లీ సెగ్మెంట్ లలో గల పోలింగ్ కేంద్రాల్లో జరిగే పొలింగ్ సరళి ని వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించారు. పోలింగ్ సరళి తెలిసే విదంగా చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.సూర్యాపేట లోని కృష్ణా నగర్ 66 పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిదంగా రామన్ కాన్సెప్ట్ హై స్కూల్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమంలో సి.ఈ. ఓ అప్పారావు, డి.ఆర్.డిఓ మధుసూదన్ రాజు, డి.పి.ఓ సురేష్ కుమార్,ఆర్.డి.ఓ వేణుమాధవ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి,ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు  శ్రీనివాసరాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.