నవతెలంగాణ – భువనగిరి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటరు జాబితాను జిల్లా అధికార యంత్రాంగం గురువారం విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 453817 మంది ఓటర్లున్నారు. గత కొంతకాలంగా ఓటరు నమోదుతోపాటు సవరణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జాబితాలో తప్పులు లేకుండా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల వారీగా జనవరి 20, 21తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను నిర్వహించి నూతన ఓట్లు నమోదు. మార్పులు, చేర్పులు చేపట్టారు. జిల్లాలో రెండు నియోజకవర్గంలో 566 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తూది జాబితా ప్రకారం ఓటర్లు వివరాలు
నియోజకవర్గం మహిళ పురుషుల ఇతర మొత్తం
భువనగిరి 108598 111358 1 219957
ఆలేరు 116344 117497 19 233860
మొత్తం 224942 228855 20 453817