చైర్మన్ పదవి కోసం దళితుల్లో పెరుగుతున్న పోటీ

Increasing competition among Dalits for the post of chairmanనవతెలంగాణ – మద్నూర్
మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దు లో గల మద్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి జిల్లాలో ప్రఖ్యాతగాంచింది ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం రిజర్వేషన్ డిక్లేర్ కాకపోయినప్పటికీ దళితులు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ ఏడాది మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎస్సీ మహిళా గా రిజర్వేషన్ వస్తుంది అనే పుకార్లు వినబడుతున్నాయి. అధికారికంగా మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రిజర్వేషన్ ఏది అనేది ఇంకా డిక్లేర్ కాలేక పోయినప్పటికీ, దళితులు మాత్రం ఈసారి ఎస్సీ మహిళకే చైర్మన్ పదవి ఉంటుందని జోరుగా పుకార్లు వినబడుతున్నాయి. మద్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలో మద్నూర్ జుక్కల్ మండలాలతో పాటు ఇటీవల నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలం కూడా ఉంది. ఈ మూడు మండలాల పరిధిలోని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకంటే తమకే వస్తుందని ఆశతో కాంగ్రెస్ ఐ కమాండ్ వద్ద జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు వద్ద మద్దతు కోసం ముమ్మర్ ప్రయత్నాలు జరుపుతున్నట్లు జోరుగా చర్చలు వినబడుతున్నాయి. మద్నూర్ మార్కెట్ కమిటీ పత్తి కొనుగోళ్లలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రఖ్యాత గాంచింది ప్రతి సంవత్సరం పత్తి కొనుగోళ్ల మూలంగా ఈ మార్కెట్ కమిటీకి కోట్లల్లో ఆదాయం వస్తుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి దళితుల్లో రోజు రోజుకు పోటితత్వం పెరుగుతున్నట్లు ప్రజల్లో జోరుగా చర్చలు వినబడుతున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రిజర్వేషన్ ఎస్సీ మహిళా గా వస్తుందా లేక రిజర్వేషన్ లో మార్పు ఉంటుందా అనేది తెలియని పరిస్థితి. ఏది ఏమైనా ఈసారి మాత్రం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కి ఎస్సీ మహిళా గా రిజర్వేషన్ కచ్చితంగా వస్తుందని చర్చలు జోరుగా వినబడుతున్నాయి. రిజర్వేషన్ డిక్లేర్ ఎప్పుడు అవుతుందో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.