నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రస్తుతం వస్తున్న రకరకాల కేసుల్లో ఫొరెన్సిక్ సైన్స్ ప్రాధాన్యత పెరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ అన్నారు. బుధవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రొబ్ ల్యాబ్ ఫొరెన్సిక్ సైన్స్ పై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. దీనికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అథితిగా హాజరై కేసుల్లో ఫొరెన్సిక్ సైన్స్ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ మాట్లాడుతూ… ఆధునిక కాలంలో నేరాల నిర్ధణాలో ఫారెన్సిక్ సైన్స్ ప్రధానమైందన్నారు. కేసులను డిఫెన్స్ చేసే న్యాయవాదులు దేనిని కూడా గుడ్డిగా నమ్మొద్దన్నారు. ఫొరెన్సిక్ పై అవగాహన కల్పించేల సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అధునాతన టెక్నాలజీలపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్, అమరెందర్ రెడ్డి,, శ్రీనివాస్, ఏ రహిం, రమన్ దేశ ముక్, న్యాయవాదులు పాల్గొన్నారు.