– ప్రయణికులకు తప్పని ఇబ్బందులు.
నవతెలంగాణ -డిచ్ పల్లి
చిన్న వర్షమోచ్చిన, చిన్న వర్షం వచ్చిన, భారీ తుఫాను వచ్చిన ఆర్టీసీ బస్సు స్టాండ్ లో ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఇందల్వాయి మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు లేకుండా పోయింది అధికారులు ప్రజాప్రతినిధులు బస్టాండ్ పరిస్థితి ఒకసారి గమనించి సైనికులకు ఇబ్బంది లేకుండా నూతన బస్టాండ్ నెలకొల్పే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. బస్టాండ్ లో పరికి వచ్చే చోట గొయ్యి ఏర్పడడంతో దానిలో వర్షపు నీరు చేరి బస్సులకు సైతం ఇబ్బందికరంగా మారిందని ఎక్కడ డ్రైనేజీ లేక నిల్చున నీరు ఎటు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఈ బస్టాండ్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నూతన బస్టాండ్ నిర్మించే విధంగా మోడల్ బస్టాండ్ కోసం నీదులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.