ఏసర్‌ బ్రాండ్‌తో ఇండ్‌కల్‌ టెక్నాలజీ జట్టు

న్యూఢిల్లీ: సాంకేతిక సంస్థ అయిన ఇండ్‌కల్‌ టెక్నాలజీస్‌ కొత్తగా గ్లోబల్‌ ఐటిసి దిగ్గజం ఏసర్‌ సంస్థతో ట్రేడ్‌మార్క్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపింది. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో ఇండ్‌కల్‌ భారతదేశంలో ఏసర్‌ బ్రాండ్‌ క్రింద స్మార్ట్‌ ఫోన్ల రూపకల్పన, తయారీ, పంపిణీ చేస్తుందని ఇండ్‌కల్‌ టెక్నాలజీస్‌ సిఇఒ ఆనంద్‌ దూబే తెలిపారు. ఈ వెంచర్‌ ద్వారా రూ.15,000- 50వేల మధ్య విలువ చేసే స్మార్ట్‌ఫోన్లపై దృష్టి సారించనున్నామన్నారు.