నవతెలంగాణ – బంజారాహిల్స్
పాఠశాల అనంతరం ట్యూషన్ కోసం వెళ్తున్న ఓ బాలిక పట్ల టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఫిల్మ్ నగర్‌లో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక స్థానికంగా ఉండే ట్యూషన్ మాస్టర్ రాములు వద్దకు క్లాసులకు వెళ్తుండేది. ఈ క్రమంలో రాములు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో తల్లి ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.