– ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్‌కు నోటీసు అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలల జీతాలు చెల్లించకపోతే ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) హెచ్చరించింది. ఈ మేరకు ఆయన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.నరసింహ నేతృత్వంలో నాయకులు శుక్రవారం హైదరాబాద్ కోఠిలోని ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్ కార్యాలయంలో సమ్మె నోటీసును అందజేశారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు. ఏడు నెలల పీఆర్సీ ఏరియర్స్ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు.