నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామ పంచాయితీ కార్మికులను పర్మినెంట్ చేయాలని , పెరిగన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని ,ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిసెంబర్ 20 లోపు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని లేని యెడల నిరవధిక సమ్మె చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం రోజున గ్రామ పంచాయితీ యూనియన్ నాయకులతో కలిసి నిరసన తెలియజేసి అనంతరం జిల్లా పంచాయితీ అధికారి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి అంటూ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా నిత్యం గ్రామంలో పారిశుధ్య కార్మికులుగా ,మంచినీటి సరఫరా, డ్రైవర్స్ గా వివిధ కేటగీలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు కావడం లేదని కనీసవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జి ఓ నంబర్ 51 నీ తీసుకువచ్చి మల్టీపర్పస్ విధానం అమలుచేస్తారని వెంటనే ఈ జి ఓ ను సవరించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం 34 రోజులు సమ్మె చేసిన సందర్భంలో నేటి ముఖ్య మంత్రి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని కానీ సంవత్సరం పూర్తి కావస్తున్న నేటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు.సమస్యల పరిష్కరించాలని డిసెంబర్ 17 న చలో ఇందిరా పార్క్ కార్యక్రమం ఉన్నదని ఈ కార్యక్రమలో రాష్ట్ర,జిల్లా వ్యాపిత మొత్తం గ్రామ పంచాయితీ కార్మికులు పాల్గొంటున్నారని అయినా ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 20 నుండి గ్రామ పంచాయితీ కార్మికులు నిరవధిక సమ్మె చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ , జిల్లా అధ్యక్షులు బందెల భిక్షం , యూనియన్ జిల్లా నాయకులు యాదగిరి , బాలయ్య , రమేష్ , శ్రీధర్ లు పాల్గొన్నారు.