ఇండెల్‌ మనీ రూ.150 కోట్ల ఎన్‌సిడిల జారీ

న్యూఢిల్లీ : పసిడి రుణాల జారీ సంస్థ ఇండెల్‌ మనీ వ్యాపార వృద్థి కోసం నాన్‌ కన్వర్టేబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సిడి)లను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో రూ.150 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 4 వరకు ఈ ఇష్యూ తెరిచి ఉంటుందని.. ఇంతలో పరిమితి మించి సబ్‌స్క్రిప్షన్‌ నమోదయితే అప్పుడే ఇష్యూను ముగించనున్నట్లు తెలిపింది. ఏడాదికి 13.44 శాతం వడ్డీ రేటును అందించనున్నట్లు వెల్లడించింది. తమ పోర్టుపోలియోలో 91.82 శాతం పసిడి రుణాల వాటా ఉందని తెలిపింది.