
తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సరిహద్దు లో గల మద్నూర్ మండలం లోని సలాబత్పూర్ గ్రామ సమీపంలోని అంతర్రాష్ట్ర ఆర్టీవో శాఖ కార్యాలయంలో గురువారం నాడు 78వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కార్యాలయా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్ సార్ ఆవిష్కరించారు. అనంతరం సరిహద్దులు దాటే మోటారు వాహనదారులకు అరటి పండ్లు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కవిత కార్యాలయ సిబ్బంది వాహన దారులు తదితరులు పాల్గొన్నారు.