ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Grand Independence Day celebrationsనవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణంలో గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు సిద్ధ రాములు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని, ఎందరో మహానుభావుల పోరాట ఫలితం కారణంగా భారతదేశానికి స్వాతంత్రం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నాగులు, కోశాధికారి లింగం, కార్యదర్శి భూమేష్, రూట్ డైరెక్టర్ లింగం, సభ్యులు ఆంజనేయులు, భీమయ్య, నరేష్ గౌడ్, హైమద్, అన్నమయ్య, సాగర్, నరసింహ, రమేష్, బాబు, చందు యూనియన్ సభ్యులు,‌ తదితరులు పాల్గొన్నారు.