ఐరిస్ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ _బొమ్మలరామారం  

బొమ్మలరామారం మండలంలోని యావపూర్ లో గల ఐరిస్ పాఠశాలలో గురువారం 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.విద్యార్థులచే ప్రదర్శించబడిన పరేడ్ కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించారు.పిరమిడ్ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యక్ష ఆకర్షణంగా నిలిచాయి. విద్యార్థులు దేశభక్తి నృత్య ప్రదర్శన చేశారు. ఇటీవలే నిర్వహించిన వివిధ ఆటల పోటీలో విజేతలకు డైరెక్టర్ ఆర్ పి సేత్ బహుమతి  ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రుద్ర లక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది,పాల్గొన్నారు.