
భిక్కనూర్ పట్టణంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో సీఐ సంపత్ కుమార్, ఎమ్మార్వో శివప్రసాద్, ఎంపీడీవో కార్యాలయంలో రాజ్ కిరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏఈ స్వామి, వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్యాధికారి యేమిమా, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ ఎల్లయ్య అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశాలు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.