
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని తొర్లికొండ ప్రాథమిక పాఠశాల లో మంగళవారం 76వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా గ్రామంలో విద్యార్థులతో ప్రభాత్ భేరినిర్వహించడం జరిగింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్ త్రివర్ణ పతకం ఎగురావేశారు.స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ 2500/రూపాయలు సమాకూర్చారు. ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ సురేష్, ఎంపీటీసీ పద్మ, ఉపసర్పంచ్ భూమేశ్వర్, వీడీసీ చైర్మన్ జీవన్, కోశాధికారి జానకిరామ్, పీ ఎ సీ యస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. హెచ్ ఎం. జంగం అశోక్. టీచర్స్. గ్రామస్తులు పాల్గొన్నారు.