నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండల కేంద్రాలలో పార్టీ అధ్యక్షులు జెండా ఎగురవేయాలని తెలిపారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది..తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన కొనసాగుతుందని అన్నారు.ప్రజలకు ఇచ్చినా హమీలన్నింటినీ అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.