స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలి..

Independence Day celebrations should be organized in a grand manner.– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
స్వాతంత్య్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే అధికారులను ఆదేశించారు. వచ్చే ఆగస్టు 15 న భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం నాడు ఆయన జిల్లా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. పోలీస్ గౌరవ వందన స్వీకరణ, బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించాలని, స్టేజ్, సీటింగ్, పి.ఎ.సిస్టమ్, త్రాగునీరు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, గౌరవ ముఖ్య అతిథి ప్రసంగం రూపొందించాలని, పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఎన్.సి.సి. క్యాడెట్ మార్చ్ ఫాస్ట్ ఏర్పాట్లు, గ్రౌండ్ లో మెడికల్ టీమ్ తో ఎమర్జెన్సీ సేవలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్తమ సేవలందించే ఉద్యోగులను గుర్తించి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరు గ్యారెంటీల పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియచేసే శకటాల ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఆస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నిర్వహించే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రోటోకాల్ నిబంధనలను జిల్లా అధికారులు ఖచ్చితంగా పాటించాలని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్ షాలోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, కలెక్టరేటు పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్, పోలీసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.