నవతెలంగాణ – దుబ్బాక
ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితంగానే స్వాతంత్ర భారతం ఏర్పడిందని,దేశంకోసం అమరులైన వారిని స్మరిస్తూ.. వారి అడుగుజాడల్లో నడుద్దామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం,గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.అలాగే మున్సిపల్,ఎంపీడీవో,ఎంఈఓ,ఐసీడీఎస్,ఐఓసీ,వంద పడకల ఆసుపత్రి,చేనేత సహకార సంఘ కార్యాలయాల వద్ద జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్,మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్,ఎమ్మార్వో సంజీవ్ కుమార్,ఎంపీడీవో భాస్కర శర్మ,ఎంఈఓ ప్రభుదాస్,ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య,ఆయా శాఖల సిబ్బంది,పలువురు బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.