కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇండియా కూటమి ఎంపీల నిరసన..

– నిరసనలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలపై  బీజేపీ వైఖరికి నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డుల నిరసన కార్యక్రమం చేపట్టగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరసనలో పాల్గొని, మాట్లాడారు. ఈడీ, సీబీఐలను స్వంత సంస్థలుగా వాడుకొని బీజేపీయేతర ప్రభుత్వ మంత్రులను అరెస్టు చేయడం దుర్మార్గం అని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు.