న్యూఢిల్లీ: భారత్, అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కొన్ని సంఘటిత క్రిమినల్ గ్రూపులు, తీవ్రవాద సంస్థల కార్యకలాపాలపై ఉన్నత స్థాయి విచారణా కమిటీ తన నివేదికను అందచేసింది. ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను భారతీయ ఏజెంట్లు హతమార్చేందుకు ప్రయత్నించారని అమెరికా ఆరోపించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది.