19న ఇండియా సమావేశం

India Conference on 19నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇండియా గ్రూప్‌ నేతలు త్వరలో సమావేశం కానున్నారు. డిసెంబర్‌ 19న ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్డీఏను ఓడించాలని నేతలు భావిస్తున్నారు. అయితే ఈసారి జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ కఠిన పరిస్థితులు ఎదుర్కుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మూడు రాష్ట్రాల్లో ఘోర ఓటమిపాలైంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ గెలుపు తెలంగాణలో మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు ఆ పార్టీ సాధించలేదు. దీంతో ప్రధాన ప్రతిపక్షం, ఇండియా కూటమికి చెందిన ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ పై సీట్ల పంపకంలో ఒత్తిడి తెచ్చే అవకాశమూ లేకపోలేదు. సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో విభేదాలను కూడా కాంగ్రెస్‌ పరిష్కరించుకోవడంతో.. ఆయన కూడా త్వరలో జరిగే సమావేశానికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అఖిలేష్‌, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ గైర్హాజరుతో డిసెంబర్‌ 6న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమిని ఢ కొట్టడానికి ప్రతిపక్ష నేతలు ఇండియా కూటమిగా జతకట్టారు.