నైతిక నిర్దేశాన్ని కోల్పోయిన భారత్‌

అరుంధతీ రారు డిసెంబర్‌ 13న కేరళలోని తిరువనంతపురంలో నిర్వ హించబడిన పి.గోవింద పిళ్ళై అవార్డు కార్యక్రమంలో అవార్డు గ్రహీత అరుంధతీ రారు సంగ్రహ ప్రసంగ పాఠం. నేనీరోజు అత్యవసరమైన విషయం గురిం చి మాట్లాడాలని అనుకుంటున్నాను. మన దేశం తన నైతికనిర్దేశాన్ని కోల్పోయింది. అత్యం త హేయమైన నేరాలు, జాతి సం హారం, జాతి ప్రక్షాళనకు పిలుపునిచ్చే భయంకరమైన ప్రకట నలను రాజకీయ ప్రతిఫలాలతో స్వాగతిస్తు న్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీక తమై ఉంటుండగా,పేదలకు రొట్టె ముక్కలు విసరడం అనేది వారిని పేదలుగా మార్చే శక్తు లకు మద్ధతు ఇవ్వడమే అవుతుంది.
నేడు మనను తికమక పెట్టే చిక్కు సమస్య ఏమంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమను తాము నిర్వీ ర్యం చేసుకునే విధంగా ఓట్లు వేస్తున్నట్లు కనపడుతున్నారు. వారు అందుకుంటున్న సమాచారం ఆధారంగా వారు ఈ పని చేస్తున్నారు. ఆ సమాచారం ఏమిటి? దానిని నియంత్రిం చేదెవరు? ఎవరు సాంకేతికతను నియంత్రిస్తారో వారే ప్రపం చాన్ని నియంత్రిస్తారు. కానీ చివరికి, ప్రజల్ని ఎవరూ నియం త్రించలేరనీ, ఒక కొత్తతరం తిరుగుబాటు చేస్తుందని నేను నమ్ముతాను. అక్కడ ఒక విప్లవం వస్తుంది. క్షమించండి, విప్లవాలు వస్తాయి.
ఒక దేశంగా, మనం మన నైతిక నిర్దేశాన్ని కోల్పోయా మని నేను అన్నాను. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు-యూదులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, కమ్యూనిస్టులు, నాస్తికులు, అజ్ఞేయవాదులు గాజాలో తక్షణ మే కాల్పులు విరమించాలనే పిలుపుతో ప్రదర్శనలు చేస్తు న్నారు. కానీ ఒకప్పుడు వలస ప్రజలకు, పాలస్తీనాకు నిజ మైన స్నేహితుడు,ఒకప్పుడు మిలియన్ల మంది ప్రదర్శనలను చూసిన మన దేశంలోని వీధులు నేడు నిశ్శబ్దంగా ఉన్నాయి. చాలామంది మన రచయితలు, ప్రజా మేధావులు, అందరూ కాదు కానీ కొద్దిమంది కూడా మౌనంగా ఉండిపోయారు. ఎంతటి ఘోరమైన అవమానం!ఎంతటి ముందు చూపు లేని తనం!మన ప్రజాస్వామ్య నిర్మాణాలు క్రమపద్ధతిలో కూల్చివేయబడడం, అపురూపమైన వైవిధ్యంతో కూడిన మన దేశం ఒకే విధమైన జాతీయవాదం అనే సంకుచిత ఆలోచ నగా మారడం గమనిస్తుంటే, తమను తాము మేధావులుగా చెప్పుకునే వారు, మన దేశం కూడా ముక్కలవుతుందనే విష యాన్ని తెలుసుకోవాలి.
పాలస్తీనియన్లను, ఇజ్రాయిలీలు నిర్దాక్షిణ్యంగా వధిం చడం గురించి మనం ఏమీ మాట్లాడకుంటే, మనం కూడా దానిలో భాగస్వాములమైనట్లే. మన నైతికత లో ఏదో ఒక మార్పు శాశ్వతంగా ఉంటుంది.ఇళ్ళు, ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు, పాఠశాలలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ రికార్డులపై బాంబులు కురిపిస్తుండగా, మిలియన్‌ ప్రజలు నిరాశ్రయులై నప్పుడు, శిథిలాల కింద నుంచి ప్రాణాలు కోల్పో యిన పిల్లల్ని బయటకు లాగుతున్నపుడు, మనం సహాయం చేస్తున్నామా? గాజా సరిహద్దులు మూసివేయబడ్డాయి. ప్రజలు ఎక్కడికీ వెళ్ళలేరు. వారికి గూడు, కూడు, నీళ్ళు లేవు. సగం కంటే ఎ క్కువ జనాభా ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి చెపుతుంది. అయినా వారిపై నిర్విరామంగా బాంబు లతో దాడి చేస్తున్నారు. ప్రజల నిర్మూలనను పట్టించుకోలేని స్థాయికి మొత్తం ప్రజల్ని అమానవీయంగా మార్చడాన్ని మరో సారి చూడబోతున్నామా మనం? పాలస్తీనియన్లను అమాన వీయంగా మార్చే ప్రణాళిక బెంజమిన్‌ నెతన్యాహుతో,అతని సిబ్బందితోనే మొదలు కాలేదు. అది దశాబ్దాల క్రిత మే ప్రారంభమైంది.
2002, సెప్టెంబర్‌ 11న, 2001 మొదటి వార్షికోత్సవంలో నేను అమెరికాలో ‘రా సెప్టెంబర్‌’ (కం సెప్టెంబర్‌) అనే ప్రసంగం చేశాను. దానిలో నేను ఇతర సెప్టెంబర్‌ 11 వార్షికోత్సవాల గురించి మాట్లాడాను. ఆ తేదీన 1973లో చిలీలో అధ్యక్షు డైన సాల్వడార్‌ అలెండీకి వ్యతిరేకంగా సీఐఏ అండ తో చేసిన తిరుగుబాటు గురించి, అదేవిధంగా సెప్టెంబర్‌ 11,1990లో అప్పటి అమెరికా అధ్య క్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌, సీనియర్‌, ఇరాన్‌కు వ్యతి రేకంగా యుద్ధం చేయాలన్న తన ప్రభుత్వ నిర్ణయ ప్రకటనపై మాట్లాడాను. ఆ తరువాత నేను పాలస్తీ నా గురించి మాట్లాడాను. ఆ భాగాన్ని చదువు తాను. అది నేను 21 సంవత్సరాల క్రితం రాసిన విషయం అని నేను మీకు చెప్పకుంటే,అది ఈ రోజు గురించే అని మీరు అనుకుంటారు.
”సెప్టెంబర్‌ 11 మధ్య ప్రాచ్యంలో కూడా విషాదమైన ప్రతిధ్వనిని కలిగి ఉంది.సెప్టెంబర్‌ 11,1922న అరబ్బుల ఆగ్రహాన్ని పట్టించుకోకుండా బ్రిటీష్‌ ప్రభుత్వం పాలస్తీనాలో ఒక ఆజ్ఞను జారీ చేసింది. సర్వోన్నతాధికారం గల బ్రిటన్‌ జారీ చేసిన 1917 బాల్ఫోర్‌ ప్రకటనను అనుసరించి,దాని సైన్యాన్ని గాజా గేట్ల బయట కేంద్రీకరించింది. బాల్ఫోర్‌ ప్రక టన, యూదు ప్రజల కోసం ఒక జాతీయ నివాసాన్ని ఇస్తా మని యూరోపియన్‌ జియోనిస్టులకు హామీ ఇచ్చింది. ఆ సమయంలో అందరినీ బెదిరించి గోళీలు పంచి పెట్టే పాఠ శాల పిల్లవాడివలె, రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యానికి జాతీయ మాతభూములను లాక్కొని, స్వాధీనం చేసుకునే స్వేచ్ఛ ఉండేది. సర్వోన్నత అధికారం, ప్రాచీన నాగరికతలను ఎంతో నిర్లక్ష్యంగా బలిచేసింది. పాలస్తీనా, కాశ్మీర్‌లు సర్వో న్నత బ్రిటన్‌ ఆధునిక ప్రపంచానికి ఇచ్చిన రక్తంతో తడిసిన బహుమతులు. నేడు రగులుతున్న అంతర్జాతీయ సంఘ ర్షణలలో ఆ రెండూ భ్రంశ రేఖలు (ఫాల్ట్‌ లైన్స్‌).
1937లో విన్‌స్ట్టన్‌ చర్చిల్‌ పాలస్తీనియన్ల గురించి ఇలా అన్నాడు: ”తాను అనుభవించలేని వాటిని ఇతరులకు కాకుండా చేసే వ్యక్తి తనకే ఆ హక్కు ఉంటుందనే విషయాన్ని నేను అం గీకరించను. ఉదాహరణకు అమెరికాలో రెడ్‌ ఇండియన్స్‌కు, ఆస్ట్రేలియాలో నల్లజాతి వారికి పెద్ద తప్పు జరిగిందంటే నేను ఒప్పుకోను. ఒక బలమైన జాతి, ఉన్నత శ్రేణిలోని జాతి, ప్రా పంచిక జ్ఞానం గల జాతి ఆ రకంగా వచ్చి, వారి స్థానాన్ని ఆక్ర మించడం ద్వారా ఈ ప్రజలకు తప్పు జరిగిందనే విషయాన్ని నేనొప్పుకోను.” అదే, పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయిల్‌ రాజ్యం వైఖరిని ఏర్పరిచింది. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి గోల్డా మెయిర్‌, ”పాలస్తీనియన్లు ఉనికిలో లేరు” అని 1969లో అన్నారు. ఆమె వారసుడు, ప్రధానమంత్రి లెవీ ఎస్కోల్‌, ”పా లస్తీనియన్లు ఏమిటి? నేను పాలస్తీనా వచ్చినప్పుడు, 2 లక్షల 50 వేల మంది యూదేతరులు, ప్రధానంగా అరబ్బులు, బెడౌయిన్లు ఉండేవారు.” అని అన్నాడు. ”పాలస్తీనియన్లు రెండు కాళ్ల జంతువులు” అని ఒకడు, పాలస్తీనియన్లు అణగ దొక్కాల్సిన ”గొల్లభామలు” మరొక ప్రధాని అన్నారు. ఇది రాజ్యాధినేతల భాష, ఇవి సామాన్యుల మాటలు కాదు.
భూమి లేని ప్రజల కోసం ప్రజలు లేని భూమి గురించిన భయంకరమైన కథనం అలా మొదలైంది.
1947లో ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను విభజించి, పాలస్తీనా భూమిలో 55శాతం జియోనిస్టులకు కేటాయిం చింది. సంవత్సరం లోపే వారు 76శాతం భూమిని స్వాధీనం చేసుకున్నారు. మే 14,1948న ఇజ్రాయిల్‌ రాజ్యాన్ని ప్రక టించారు. ఈ ప్రకటన కొద్ది నిమిషాల తరువాత అమెరికా ఇజ్రాయిల్‌ను గుర్తించింది.వెస్ట్‌ బ్యాంక్‌ ను జోర్డాన్‌ లో కలి పారు. గాజా స్ట్రిప్‌, ఈజిప్ట్‌ మిలిటరీ నియంత్రణలోకి వచ్చిం ది. పాలస్తీనా, శరణార్థులుగా మారిన వందలాది, వేలాది మంది పాలస్తీనా ప్రజల మనసుల్లో, హదయాల్లో తప్ప ఉనికిలో మాత్రం లేకుండా పోయింది.1967లో ఇజ్రాయిల్‌ వెస్ట్‌ బ్యాంక్‌, గాజా స్ట్రిప్‌లను ఆక్రమించింది. దశాబ్దాలుగా తిరుగుబాట్లు, యుద్ధాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సంధులు, ఒప్పందాల పై సంతకాలు చేశారు. కాల్పుల విరమణ జరగాలని ప్రకటిం చారు, వాటిని ఉల్లంఘించారు. కానీ రక్తపాతం మాత్రం అంతం కాదు. పాలస్తీనా ఇప్పటికీ అక్రమమైన ఆక్రమిత ప్రాంతంగానే మిగిలింది.దాని ప్రజానీకం అమానవీయమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. వారు అక్కడ సామూహిక శిక్ష లకు గురవుతూ, 24 గంటల కర్ఫ్యూలో మగ్గుతున్నారు. ప్రతీ రోజు వారిని క్రూరంగా అవమానిస్తున్నారు. వారి ఇళ్ళు ఎప్పు డు కూల్చివేయబడతాయో,వారి పిల్లలపై ఎప్పుడు కాల్పులు జరుగుతాయో, వారి విలువైన చెట్లను ఎప్పుడు నరికివేస్తారో, వారి రోడ్లు ఎప్పుడు మూసివేస్తారో, ఆహార పదార్థాలు, మం దులు కొనేందుకు మార్కెట్లకు వెళ్ళేందుకు ఎప్పుడు అను మతిస్తారో వారికి అస్సలు తెలియదు. వారెలాంటి గౌరవం లేకుండా,కనుచూపు మేరలో ఆశ కనిపించని స్థితిలో బతు కుతున్నారు. వారికి వారి భూములపై, వారి భద్రతపై, వారి కదలికలపై, వారి సమాచారంపై, వారి నీటి సరఫరా పై నియంత్రణ లేదు. తమ ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేని పాలస్తీనా యువకులు తమను తాము మానవ బాంబు లుగా మార్చుకొని, ఇజ్రాయిల్‌ వీధుల్లో, బహిరంగ ప్రదే శాల్లో సంచరిస్తూ వారిని వారు ఆత్మాహుతి చేసు కుంటూ, సాధారణ ప్రజల్ని చంపుతూ, రోజువారీ జీవి తంలో భయాన్ని నింపుతూ చివరికి రెండు సమాజాల అనుమానాలను, పరస్పర ద్వేషాన్ని కఠినతరం చేస్తు న్నారు. ప్రతీ బాంబు దాడి పాలస్తీనా ప్రజలపై కనికరం లేని ప్రతీకారాన్ని, కష్టాల్ని ఆహ్వానిస్తోంది. అయితే ఆత్మా హుతి దాడి అనేది వ్యక్తిగత నిరాశకు చెందిన చర్య అవుతుంది, అది విప్లవ వ్యూహం కాదు.
ఈ వైరుధ్యానికి శాంతియుతమైన, నిష్పాక్షిక పరిష్కారాన్ని కోరుతూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని ఇజ్రాయిల్‌తో పాటు అమెరికా ప్రభుత్వం నిరోధించింది. ఇజ్రాయిల్‌ చేసిన ప్రతి యుద్ధానికి అమెరికా మద్ధతు పలి కింది. పాలస్తీనా పై ఇజ్రాయిల్‌ దాడి చేసినప్పుడు, పాలస్తీ నియన్ల ఇళ్ళను ధ్వంసం చేసేది అమెరికా క్షిపణులే. ప్రతీ సంవత్సరం అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును కొన్ని బిలియన్‌ డాలర్లను ఇజ్రాయిల్‌ పొందుతుంది.
నేడు ఇజ్రాయిల్‌, పౌరులపై వేస్తున్న ప్రతి బాంబు, ప్రతి ట్యాంక్‌, ప్రతి బుల్లెట్‌ పైన అమెరికా పేరు ఉంటుంది. అమెరికా హదయపూర్వక మద్ధతు లేకుండా ఇంత జరగదు. డిసెంబర్‌ 8న, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం లో 13 సభ్య రాజ్యాలు కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేసినప్పుడు ఏమి జరిగిందో మనం చూశాం, అమెరికా దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. నల్ల జాతి అమెరికన్‌ అయిన అమెరికా డిప్యూటీ అంబాసిడర్‌ ఆ తీర్మానాన్ని వ్యతి రేకిస్తూ చెయ్యి ఎత్తిన వీడియో చూస్తుంటే మనసు దహించి వేస్తుంది. సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు చేసిన కొందరు వ్యాఖ్యాతలు దీనిని నానాజాతి సామ్రాజ్యవాదం (ఇంటర్‌ సెక్షనల్‌ ఇంపీరియలిజం) అని అన్నారు.
(ఇంకా వుంది)
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌
9848412451

అరుంధతీ రారు