ఇండియాంటేనే..ఇందిర గాందీ..

• వర్థంతి దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ 
• మండలపార్టీ అధ్వర్యంలో ఇందిర గాందీ వర్థంతి
నవతెలంగాణ-బెజ్జంకి 
ప్రాణాపాయ స్థితి ఉందని తెలిసి.. దేశం కోసం ప్రాణాలర్పించిన మహిళ ప్రధాని ఇందిర గాందీయేనని.. ఇండియాంటేనే.. ఇందిర గాందీ అని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ కొనియాడారు.గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని ఇందిర గాందీ వర్థంతి దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ శ్రేణులు ఇందిర గాందీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మహిళల అభ్యున్నతికి అహర్నిశలు కృష చేసిన గొప్ప ప్రధాని ఇందిర గాందీయేనని రత్నాకర్ రెడ్డి తెలిపారు.ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,పార్టీ మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,నాయకులు రొడ్డ మల్లేశం,జెల్ల ప్రభాకర్,బైరి సంతోష్,జేరిపోతుల మధు,ఇస్కీల్ల ఐలయ్య,బొనగం రమేశ్,ఐలేని శ్రీనివాస్ రెడ్డి,డైరెక్టర్ బండిపెల్లి రాజు తదితరులు హజరయ్యారు.