అక్టోబర్ 7, 2024 నాటికి గాజాపై ఇజ్రాయిల్ అమానుష దాడి ప్రారంభించి సంవత్సరకాలం అయింది. గాజా స్ట్రిప్‌పై దాడుల్లో సుమారు 42వేల మంది ప్రజలు చనిపోయారు.ఈ హృదయం లేని యుద్ధంలో, గాజాలో పౌరులు, మహిళలు, పిల్లలు బలిపశువులు అయ్యారు.వెస్ట్ బ్యాంకులో, దాడుల వల్ల లెబనాన్‌కు సంబంధించిన 16,705 మంది పిల్లలు మృతిచెందారు. ఇది ఏడాది కాలంలో జరిగిన ఘర్షణల్లో అతిపెద్దది. ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా అమెరికా, ఐరోపాలతో పాటు, వాటి వెలుపల ఉన్న నగరాలలో కూడా కోట్లమందీ ప్రజలు ప్రజలు, సామూహికంగా భారీ ప్రదర్శనలు నిర్వహించారు. దీనివలన ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, ఆ తరం ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించింది, దాంతో ఇది ఆ కాలంలోనే గొప్ప సమస్యగా ముందుకొచ్చింది.
నేడు ఈ అమానుషమైన చర్యలపై, భారతదేశంలో ఆశించిన ప్రతిస్పందన కొరవడింది.ఈ యుద్ధం ఇజ్రాయిల్‌పై హమాస్ చేసిన భయంకరమైన దాడి వల్ల 1200 మంది ఇజ్రాయిల్ పౌరులు చనిపోవడం, 200 మందికి పైగా పౌరులను హమాస్ బందీలుగా చేసినందుకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడిగా పరిగణిస్తున్నారు. దానికి ప్రతీకారంగా, ఇజ్రాయిల్ చేపట్టిన క్రూరమైన దాడి, అనేకసార్లు తమ స్థావరాలను నుండి, ఆవాసాల నుండి, పాలస్తీనీయులను తరిమించేయడమనేది ఆందోళన కలిగించే అంశం. ఇది ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు.ముఖ్యంగా ప్రపంచంలోనే, వలసవాద వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించిన అతి పెద్దదేశంగా, అనేక దేశాలు తమ తమ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాల్లో, భుజం భుజం కలిపి నిలబడిన దేశం మనది. ఒకప్పుడు భారతదేశం పాలస్తీనాకు, నిజమైన స్నేహితునిగా ఉంది.పాలస్తీనా, పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ)ను గుర్తించిన మొట్టమొదటి అరబ్‌యేతర దేశంగా ఉన్న భారతదేశం, నేడు ఇజ్రాయిల్‌కు, దాని శ్రేయోభిలాషి అయిన అమెరికాకు, సన్నిహితంగా వ్యవహరిస్తున్నది. పాలస్తీనాలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాల పట్ల భారత్‌లో నిరంతర నిరసనలు గాని, వారి బాధల పట్ల బహిరంగ విచారంగానీ, ఆందోళనలుగానీ లేవు. ఇతర దేశాలలో ప్రదర్శించబడిన కనీస స్థాయి నిరసనలు, ఆగ్రహం మన దేశ ప్రజలు వెలిబుచ్చలేదు. కేరళలోని మల్లపురం, కోజికోడ్‌లలో రెండు పెద్ద ఊరేగింపులు నిర్వహించారు. ఇవి కాకుండా కోల్‌కత్తా, చెన్నరులలో కొద్దిపాటి నిరసనలు జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో అవి కూడా లేవు. ఇజ్రాయిల్ పాలస్తీనా పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఇండియా ఎలాంటి ఆగ్రహాన్ని గాని, నిరసనలు గాని తెలియజేయడానికి సిద్ధంగా లేదని దీని వల్ల అర్థమవుతుంది.
భారత ప్రభుత్వం నిస్సందేహంగా, నిరసనలను అరికట్టడమే గాక, అనేక సందర్భాలలో వాటిని నిషేధించింది. గాజాలో జరుగుతున్న పరిణామాలపై, ప్రజల నిరసనలను అడ్డుకునేందుకు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నది. గాజాలో జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా, మద్దతునిస్తూ, నిరసనలు తెలిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.పాలస్తీనీయుల జెండాలను ప్రదర్శించడంపై, సామాజిక మాధ్యమాల్లో పాలస్తీనా అనుకూల అంశాలను ఉంచడంపై, నిషేధం విధించింది. కానీ కీలకమైన అంశాలపై, వీధులలో వెల్లువెత్తుతున్న ఇదేవిధమైన నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. పాలస్తీనా సమస్యపట్ల మితవాద హిందూత్వకు ఉన్న విధానపరమైన చిన్నచూపే, ఇజ్రాయిల్ జియోనిస్టులకు మద్దతు పలికే అనుకూల విధానాలు, ఈ సమస్య పట్ల వారికి ఎలాంటి స్పందన లేకపోవడానికి కారణం.పాలస్తీనీయులకు మద్దతునిచ్చే స్థాయి నుంచి భారత్ ఇజ్రాయిల్‌కు దాదాపు షరతులు లేని మద్దతునిచ్చే స్థాయికి చేరుకుంది.ఈ మద్దతు గాజా సంక్షోభాన్ని అత్యధిక భారతీయులు చూసే విధానంలో త్వరితగతిన మార్పు వచ్చింది.భారత్‌లో సమూలంగా మారిన రాజకీయ వాతావరణంలో పాలస్తీనీయులపై హింసాకాండ పట్ల, గతంలో మాదిరిగా ఉద్వేగపూరితమైన స్పందన లేదు.
అయితే అంత మాత్రం చేత, సానుభూతి అసలే లేదని అర్థం కాదు. కానీ, గాజాలో సంక్షోభం దాని పట్ల భారతదేశపు స్పందన ఈ ముఖ్యమైన వాస్తవాన్ని సూచిస్తుంది. హిందూ జాతీయవాదం ఉద్దేశపూర్వకంగా పాలిస్తీనా సమస్యను ముస్లిం సమస్యగా చూస్తున్నది.దీనర్థం,ఈ సమస్యకు ఎలాంటి మద్దతైనా, ఒక కమ్యూనిటీని బుజ్జగించినట్లుగా నిందమోపబడవచ్చుననే అభిప్రాయంతో భారతప్రభుత్వం ఉంది. ప్రతిపక్ష నాయకులు, వ్యక్తిగతంగా పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడినప్పటికీ, ఏ ప్రతిపక్ష పార్టీ కూడా, ఈ సమస్య విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోలేదు.కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే ఇజ్రాయిల్‌ను స్పష్టంగా ఖండించాయి. కొన్నిచోట్ల నిరసన ప్రదర్శనలు కూడా చేశాయి. నిరసనలతో పాటు బహిష్కరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఆంక్షలు విధించే ప్రచారాలకు కూడా మద్దతు ప్రకటించాయి.భారతదేశంలో కేవలం పార్టీలే కాక, పౌరసమాజం కూడా ఈ దారుణాల పట్ల మౌనం వహించింది. ఈ స్పందన లేకపోవటానికి, దేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రభావం క్షీణించటం, అభివృద్ధి చెందుతున్న ప్రపంచంతో పాటు ఇతరులలో కూడా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గడానికి కారణమని చెప్పవచ్చు. అమెరికా పట్ల రాజకీయ ఆసక్తి పెంపొందడం, అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేయడంతో, రాజకీయ ఆసక్తి అమెరికాపై కేంద్రీకృతమైంది. చైనాకు శక్తివంతమైన ప్రత్యామ్నాయశక్తిగా భారత్‌ను చూడటం, తదితర అంశాలు తోడ్పడుతున్నాయి. భారత్‌ను ప్రపంచ ప్రత్యామ్నాయ శక్తిగా ప్రచారం చేయడంపై అమెరికా ఆసక్తి చూపుతున్నది.
దేశాల సోపాన క్రమంలో, భారతదేశ స్థానాన్ని గూర్చి, లోతుగా శ్రద్ధ వహించే ఉన్నత, మధ్యతరగతి వర్గాలకు ఇది చాలా ముఖ్యమైనది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే,గత సంవత్సర కాలంగా సహజంగానే, మీడియాలో వార్తలను కుదించడంతో పాటు, దేశంలోని టెలివిజన్ ఛానల్స్ అన్నీ కూడా, ఇజ్రాయిల్, గాజా సంఘటనలపై పూర్తి సమాచారాన్ని ఇస్తున్నప్పటికీ, ఎక్కువ శాతం ఇజ్రాయిల్‌కు అనుకూలమైన దృక్పథంతోనే ఇస్తున్నాయి.తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనే పేరుతో ప్రధాన రాజకీయ సమస్యలను పక్కదారి పట్టించే ప్రయ త్నం జరుగుతున్నది. మారుతున్న వైఖరికి మద్దతునిస్తున్న ఉన్నత వర్గాలకు, ఇది అనుకూలమైనది. పాలస్తీనాపైనే కాక, ఈ వైఖరి సంఘర్షణలకు దారితీసే వలసవాదం, వలస పాలన అనే రెండు సమస్యలను విస్మరిస్తుంది. దీనిస్థానంలో, కేంద్ర సమస్యగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే అధికారిక వర్గపు, మార్గానికి ఎక్కువ మద్దతు లభిస్తున్నది. దీని ఫలితంగా సరిహద్దుల నుండి ఉగ్రవాద దాడులకు మనం బాధితుల మైనందున భారత దేశం దీనికి మద్దతునివ్వాలి. కానీ పాలస్తీనా సమస్య, అక్టోబర్ 7న ప్రారంభం కాలేదు. దానికి విస్త్రతమైన చారిత్రక నేపథ్యం ఉంది. కానీ పాశ్చాత్యదేశాలేకాక, అదేవిధంగా భారతీయులైన ఉదారవాద, మితవాద సమర్ధకులు, పైవిషయాన్ని అంగీకరించరు. స్థిర నివాసుల వలసవాదం వల్ల, ఆక్రమణల కారణంగా ఈ సమస్య ఏర్పడిందనే వాస్తవం విస్మరించ బడింది. 1948లో పాలస్తీనీయులను,వారి మాతృభూమి నుండి హింసాత్మకంగా గెంటివేయడం, జాతి నిర్మూలనా పద్ధతులు, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ హింసాత్మక సంఘటనలకు కారణమని అంగీకరించడానికి వారు ఇష్టపడక పోవడాన్ని సూచిస్తుంది. హమాస్ దాడి సాకుతో, అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ పశ్చిమాసియాను, నియంత్రించడానికి ఉపయోగపడింది. ముస్లిం ప్రపంచంలో వారి తిరుగులేని ఆధిపత్యానికి అవసరమైన అవకాశం దొరికింది.
అయితే ఇటీవల కాలంలో భారతదేశం ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించినా, పాలస్తీనీయుల దుస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతకంటే ఏమీ లేదు.ఈ మార్పు ఇజ్రాయి ల్‌తో భారతదేశానికి పెరుగుతున్న సాంకేతిక, రక్షణ, వాణిజ్య సంబంధాలలో సహకారాన్ని సూచిస్తుంది. 1999లో పాకిస్తాన్ పై భారత్ నిర్వహించిన కార్గిల్ యుద్ధ సమయంలో, ఇజ్రా యిల్ ఇండియాకు సైనిక సహాయం అందించినప్పటి నుండి రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలప డ్డాయి. వాటి రక్షణ, గూఢచారి వ్యవస్థలను భారతదేశంలో ఉన్న వ్యవస్థలతో, అమెరికా అనుసంధానం చేయడం వల్ల భారత దేశంతో రాజకీయ అనుబంధాన్ని మరింత పెంచడానికి ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేసింది. అనతి కాలంలోనే, ఒక వ్యూహాత్మక సంబంధంగా మారింది. పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేసిన భారీ హింసాకాండ దిగ్భ్రాంతి కరం. ఇజ్రాయిల్ అమానుషత్వం పట్ల, చట్ట విరుద్ధమైన ఆక్రమణలు, జాతి ప్రక్షాళన గురించి మనం ఆగ్రహం చెందకపోతే టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో, ప్రత్యక్షంగా చూసిన దాని ఆధారంగా మనం కూడా నిజమనుకునే అవకాశం ఉంది. దాన్ని ఉదార వాద నిర్మాణానికి సంబంధించిన నైతిక నిర్మాణం అని భావించి నట్లయితే,మానవహక్కుల మనుగడే ప్రమాదంలో పడుతుంది.
(‘హిందూ’ సౌజన్యంతో)
అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు,
9490300111
జోయాహసన్