న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధికంగా గొడ్డు మాంసం ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. 2022లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ గతేడాది రెండో స్థానానికి చేరింది. మాంసం విక్రయాల పేరుతో దేశంలో సంఫ్‌ు పరివార్ మూకలు సామూహిక హత్యలకు పాల్పడుతున్న వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో గొడ్డు మాంస ఎగుమతులు పెరిగిపోయాయన్న వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా వ్యవసాయ శాఖ రిపోర్టు ప్రకారం, 2023వ సంవత్సరంలో గొడ్డు మాంసం ఎగుమతుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. అమెరికా మూడవ స్థానంలోను, ఆస్ట్రేలియా నాల్గవ స్థానంలో నిలిచాయి.