– ఆసీస్-ఏ లక్ష్యం 225, ప్రస్తుతం 139/3
మకాయ్: ఆస్ట్రేలియా-ఏతో తొలి అనధికార టెస్టులో భారత్-ఏ ఓటమి అంచుల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే కుప్పకూలిన కుర్రాళ్లు.. రెండో ఇన్నింగ్స్‌లో పోరాడింది. రుతురాజ్ (103), పడిక్కల్ (88) పోరాటంతో 312 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్- 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 139/3తో విజయం దిశగా సాగుతోంది. మార్కస్ హారిస్ (36, 82 బంతుల్లో 4 ఫోర్లు), నాథన్ మెక్‌స్వీనే (47 నాటౌట), వెబ్‌స్టర్ (19 నాటౌట్) రాణించారు. నేడు ఆసీస్-ఏ విజయానికి 86 పరుగులు అవసరం కాగా.. భారత్-ఏ ఏడు వికెట్ల దూరంలో నిలిచింది.