– గంభీర్, అగార్కర్ ప్రెస్ మీట్ నేడు
ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయోత్సవం ముగించుకున్న టీమ్ ఇండియా నేడు శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ భారత్ జింబాబ్వే పర్యటనను విజయంతం చేసుకుని స్వదేశం చేరుకోగా.. ఆ జట్టులోకి కుర్ర క్రికెటర్లకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌లో అవకాశాలు కల్పించింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించనున్నారు. శ్రీలంక పర్యటన నుంచే టీమ్ ఇండియా చీఫ్ కోచ్‌గా తొలి పరీక్ష ఎదుర్కొన్న గౌతం గంభీర్.. నేడు భారత చీఫ్ కోచ్‌గా నేడు తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొననున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. టీమ్ ఇండియా సెలక్షన్ నిర్ణయాలపై అజిత్ అగర్కార్ మీడియా నుంచి కఠిన ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది.