– 59 పరుగులతో
– తొలి వన్డేలో విజయం
అహ్మదాబాద్ : టీ20 ప్రపంచకప్ ఓటమికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. మహిళల పొట్టి ప్రపంచకప్ విజేత న్యూజిలాండ్‌పై అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన తొలి వన్డేలో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా అమ్మాయిలు 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తేజల్ (42), దీప్తి (41), షెఫాలీ వర్మ (33),జెమీమా రొడ్రిగస్ (35), యస్టికా భాటియా (37) రాణించారు. ఛేదనలో న్యూజిలాండ్ అమ్మాయిలు చతికిల పడ్డారు. రాధ యాదవ్ (3/35), సైమ (2/26)లు మెరవటంతో న్యూజిలాండ్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది.