– ఆసీస్‌తో సఫారీ ఢీ
– సెమీస్ బెర్త్‌లు ఖరారు
2023 ఐసీసీ ప్రపంచకప్ సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. 8 మ్యాచుల్లో 8 విజయాలు సాధించిన టీమ్ ఇండియా అగ్రస్థానం పదిలం చేసుకోగా.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ ఐదో విజయంతో నాల్గో సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంది. దీంతో నవంబర్ 15న ముంబయి వాంఖడె స్టేడియంలో తొలి సెమీఫైనల్లో ఆతిథ్య భారత్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. అక్టోబర్ 16న కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఢకొీట్టనున్నాయి. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌కు సాంకేతికంగా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇంగ్లాండ్‌పై పాక్ 300 పైచిలుకు పరుగుల తేడాతో నెగ్గాలి. లేదంటే, తొలుత ఇంగ్లాండ్ 150 పరుగులు చేస్తే.. లక్ష్యాన్ని పాక్ 3.4 ఓవర్లలోనే ఛేదించాలి. న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుందనే చెప్పాలి.